1)మిమ్మల్ని ఎండ నుంచి వాన నుంచి రక్షించ లేని గోడుగుని
ఎవరు నేను ?
జవాబు : గుడుగో ట్టపు
2)రెండు అంగుళాల గదిలోఅరవై మంది దొంగలుతల,మొండం ఉన్నాయి కానీ కాళ్ళు,చేతులు లేవు ఎవరు వాళ్ళు ?
జవాబు : లుల్లపు లోట్టే పెగ్గి అ
3)అడ్డంగా కొస్తే చక్రాన్నవుతా నిలువుగా కొస్తే శంఖాన్నవుతా ఎలా కోసినా నిన్నేడిపిస్తా ఎవరు నేను
జవాబు: యపాల్లి ఉ
4)తల ఒకటే కాని చేతులు మూడుంటాయి నేనెవరో చెప్పు కొండి?
జవాబు: ముర యాడిగ
5)
నాట్యం చేస్తాను కానీ
నాట్య కత్తెను కాను
ఒళ్లంతా కళ్ళే కాని
రెండింటి తోనే చూస్తాను
నా పేరేంటి?
జవాబు :లిమనే
6)
దేహమంత కళ్ళు కానీ
దేవేంద్రుడుని కాను
నరుడి సాయం లేక పొతే
ఎటూ నడవ లేను
ఎవరు నేను?
జవాబు: లవ
7)
ఒళ్ళు వేడెక్కితే
గటగట నీళ్ళు తాగేస్తాను
కాస్త చల్ల బడితే చాలు
గొల్లున ఏడ్చేస్తాను
ఇంతకీ నేనెవరు?
జవాబు: బ్బు మ
No comments:
Post a Comment